![]() |
![]() |

సిల్వర్ స్క్రీన్ మీద మన్మధుడు ఎవరు అంటే నాగార్జున అంటారు అలాగే ఫామిలీ స్టార్ ఎవరు అంటే జగపతిబాబు అంటారు. వీళ్లిద్దరి టర్నింగ్ పాయింట్ మూవీస్ వచ్చి శివ, మన్మధుడు, శుభలగ్నం వంటివి చాలా వున్నాయి. వీళ్లిద్దరు ఒక్క చోట కలిస్తే ఆ టాక్ షో పేరే "జయమ్ము నిశ్చయమ్మురా" . ఈ షో జీ తెలుగులో లేటెస్ట్ గా స్టార్ట్ అయ్యింది. ఇక మొదటిగా నాగార్జున ఈ షోకి గెస్ట్ గా వచ్చారు. అలాగే ఆయన అన్న వెంకట్, అక్క సుశీల కూడా వచ్చారు. ఇక హోస్ట్ జగపతి బాబు నాగార్జున దెయ్యాల గురించి మాట్లాడుకున్నారు. తాను, జగపతి బాబు వాళ్ళ అన్న రాముకి ఈ దెయ్యాలు, ఈ స్పిరిట్ గేమ్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పుకొచ్చారు నాగార్జున.
ఒకరోజు ఓజా బోర్డు మీద దెయ్యాలని పిలిచే స్పిరిట్ గేమ్ ఆడుతున్నప్పుడు శివాజీ గణేష్ గారు వీళ్ళు గేమ్స్ ఆడుతున్న రూమ్ లోకి వెళ్లి బాగా తిట్టారట. ఐతే అప్పటికే ఒక దెయ్యం వచ్చి అనరాని మాటలు అంది అని జగపతి బాబు క్లారిటీ ఇచ్చారు. యు డాష్ డాష్ డాష్ అని తిట్టిందని ఐతే ఆ తిట్లు చెప్పకూడదు అని అన్నారు. అప్పుడు శివాజీ గణేశన్ గారు దెయ్యం ఉందన్న విషయాన్ని నమ్మారు అని చెప్పారు. జగపతి బాబుకు దెయ్యాలంటే చాలా భయం. సినిమాల్లో అంత పెద్ద విలన్ గా క్రూరమైన రోల్స్ చేస్తాడు కానీ దెయ్యాలంటే చాలా పిరికోడు..రాత్రయితే అన్ని లైట్స్ ఆన్ చేసుకుని ఏసీ ఆన్ చేసుకుని పడుకుంటాడు అని చెప్పారు నాగార్జునా. అవును దెయ్యాలంటే నాకు భయం ఎందుకంటే మనుషుల్ని డీల్ చేయొచ్చు కానీ దెయ్యాన్నీ నేనెక్కడ డీల్ చేయను. ఇప్పుడంటే మనుషులే దెయ్యాలైపోయారు అది వేరే సంగతి అని చెప్పుకొచ్చారు జగపతి బాబు.
![]() |
![]() |